🌬️ గాలిపటం...
దారం ఉన్నంత వరకూ 🎐
ఎగురుతూనే ఉంటుంది...
"నాకు స్వేచ్ఛ కావాలి!" అంటూ 🔗
తన్ను విడిపించుకోవాలని చూస్తుంది...
అయితే ఆ దారంతో ఏర్పడే టెన్షన్ 🪢
ఆ పతంగిని మరింత పైకి తీసుకెళ్తుంది ⬆️🪁...
వదిలేస్తే ❌
అది ఎగిరిపోతుంది...
కానీ ఎక్కడ ఆగిపోతుందో ఎవరికీ తెలీదు 🤷♂️...
అదేలా 👦👧...
అమ్మ రోజు 📅 మనకు చెపుతూ ఉంటుంది ...
ఇలా చేయొద్దు... అలా చేయొద్దు... 📛
తప్పు చేస్తే మందలిస్తుంది 🗣️
నీతులు చెబుతుంది 📚
వీటన్నింటినీ చూసి...
"ఈ గొడవ లేక పోతే
బావుండు కదా ...
నేను స్వేచ్ఛగా బతికేయొచ్చు" అనుకుంటారు 😓
కానీ అసలు నిజం ఏమిటంటే...
ఆ దారమే మనకు ఆధారం 🧶
అది లేకపోతే...
మన ప్రయాణం ఎక్కడో 😣
ఏ మూళ్ళ కంచెకో... కరెంటు వైర్కో...
డీ కొట్టి... ఆగిపోవాల్సిందే ⚡🛑
ఏదో ఒక మేడ మీద...
ఉసూరుమని వాలిపోవాల్సిందే 😞
☁️ మబ్బులు తేలికగా కనిపిస్తాయి...
కానీ వాటిలో గర్జనలు దాగుంటాయి 🌩️
ఎండలని, వానలని, తుపాన్లని మోస్తాయి 🌞🌧️🌪️
అమ్మ కూడా అలాగే...
తన బాధల్ని బయట పెట్టదు 😔
కేవలం ప్రేమనే పంచుతుంది ❤️
అమ్మ ఓ మబ్బులా చల్లగా నీడ నిస్తూవుంటే ☁️
మనం ఆ మబ్బుల్లో గాలిపటంలా
ఆశల దారంతో ఎగురుదామా 🪁💫
🌸 Happy Mother's Day 🌸
💖 To All The Beautiful Mothers 💖
🙏 మీరు లేకపోతే... మేమే లేము! 🙏
0 Comments