Header Ads Widget

VENNELA VENNELA MELLAGA RAAVE SONG BY KSR @ PREMA DESHAM MOVIE


వెన్నెలా వెన్నెలా… మెల్లగా రావే
పూవుల తేనెలే తేవే…
వెన్నెలా వెన్నెలా… మెల్లగా రావే
పూవుల తేనెలే తేవే…

కడలి ఒడిలో నదులు ఒదిగి… నిదుర పోయే వేల
కన్నుల పైన కలలే వాలి… సోలి పోయే వేల…

వెన్నెలా వెన్నెలా… మెల్లగా రావే
పూవుల తేనెలే తేవే…

ఆశ ఎన్నడూ విడువదా… అడగ రాదని తెలియదా
నా ప్రాణం చెలియా నీవేలే…
విరగబూసిన వెన్నెలా… వదిలి వెయ్యకే నన్నిలా
రారాధ ఎద నీదే కాదా…
నిదురనిచ్చే జాబిలి… నిదురలేక నీవే వాడినావా…

వెన్నెలా వెన్నెలా… మెల్లగా రావే
పూవుల తేనెలే తేవే…

మంచు తెరలో అలిసిపోయి… మధన సంధ్య తూగెనే
పుడమి ఒడిలో కలలు కంటూ… పాపాయి నువు నిదురపో
మల్లె అందం మగువ కెరుక… మనసు బాధ తెలియదా
గుండె నిండా ఊసులేని… ఎదుటనుంటే మౌనమే
జోల పాట పాడినానే… నిదురలేక పాడినా…

వెన్నెలా వెన్నెలా… మెల్లగా రావే
పూవుల తేనెలే తేవే… ||2||

Post a Comment

0 Comments